News March 13, 2025
మెట్రోలో ప్రయాణిస్తున్నారా?

TG: మెట్రో స్టేషన్లలో తనిఖీల సమయంలో పలు వస్తువుల విషయంలో సిబ్బందికి ప్రయాణికులకు మధ్య తరచుగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్యాసింజర్ల కోసం ఎంట్రన్స్ వద్దే నిషేధిత వస్తువుల జాబితాను మెట్రో ఏర్పాటు చేసింది. మండే స్వభావం ఉన్న వస్తువులు, తుపాకులు, గొడ్డలి, గడ్డపార, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలు, మాంసం, పాడైన కూరగాయలు సీల్ వేయని మొక్కలను అనుమతించరు. సీల్ వేసిన రెండు మద్యం సీసాలను అనుమతిస్తారు.
Similar News
News March 13, 2025
పిల్లలను దండించే అధికారం గురువులకు లేదా?

1990, 2000లలో గురువులంటే పిల్లలకు ఎంతో గౌరవం, భయం ఉండేవి. పిల్లలు సరిగా చదవకున్నా, అల్లరి చేసినా మందలించమని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పేవారు. వారి భరోసాతో ఉపాధ్యాయులు విద్యార్థులను దారిలోకి తెచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలపై చేయి వేద్దామంటేనే <<15742695>>ఉపాధ్యాయులు<<>> జంకాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకూ పిల్లలపై నియంత్రణ ఉండట్లేదు. మీ కామెంట్?
News March 13, 2025
Q-కామర్స్‌లో 5.5 లక్షలమందికి కొలువులు!

భారత్‌లో క్విక్ కామర్స్ రంగం వచ్చే ఏడాది లోపు 5.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది. ‘క్యూ కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరికి 5 బిలియన్ డాలర్ల వ్యవస్థగా మారనుంది. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచాలి’ అని ఓ నివేదికలో పేర్కొంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి క్విక్ కామర్స్ సంస్థల కిందకు వస్తాయి.
News March 13, 2025
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్‌వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్‌లో డయ్యర్‌ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.