News January 1, 2025

ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ

image

పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్‌క్యూబ్స్‌లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.

Similar News

News January 4, 2025

ఢిల్లీని కమ్మేసిన మంచు.. 470 విమానాలు ఆలస్యం

image

దేశ రాజధానిని పొగమంచు దట్టంగా కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎదుటి వ్యక్తి కనిపించనంత తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే 470 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. పౌరులు బయట తిరిగేందుకు భయపడే స్థాయిలో పొగ కమ్ముకోవడం గమనార్హం. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

News January 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 4, 2025

జనవరి 4: చరిత్రలో ఈరోజు

image

1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం
1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
* ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం