News August 26, 2024

నిమ్స్‌లో గురక సమస్యకు ట్రీట్‌మెంట్

image

గురక సమస్యకు చికిత్స అందించేందుకు HYD నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌ సిద్ధమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే నాలుగో వంతు ఖర్చుతోనే ఈ సేవలందిస్తామని డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు గురకకు దారి తీస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయి పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది. ల్యాబ్‌లో బాధితులపై అధ్యయనం చేసి, చికిత్స అందిస్తారు.

Similar News

News January 27, 2025

8 మంది బందీలు మరణించారు: హమాస్

image

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో హమాస్ 33 మంది బందీల విడుదలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 8 మంది చనిపోయినట్లు హమాస్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇప్పటికే ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు బందీలు మరణించడంపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

News January 27, 2025

ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలానికొకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాత కార్డుల్లో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైందని, 20,336 మంది అకౌంట్లలో ₹6K చొప్పున జమ చేసినట్లు చెప్పారు.

News January 27, 2025

141 ఏళ్లలో ఇదే తొలిసారి..

image

విండీస్‌తో జరిగిన <<15279795>>రెండో టెస్టులో<<>> PAK స్పిన్నర్ నోమన్ అలీ రికార్డు సృష్టించారు. 141 ఏళ్ల చరిత్రలో మ్యాచ్ తొలిరోజు మొదటి గంటలోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 1883లో ఆసీస్ బౌలర్ బిల్లీ గేట్స్ ఈ ఘనత సాధించారు. అలాగే ఫస్ట్ సెషన్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్‌గా, సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్‌(38Y 139D)గానూ నిలిచారు. శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ 38Y 110D వయసులో హ్యాట్రిక్ తీశారు.