News April 21, 2025
చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.
Similar News
News August 9, 2025
అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News August 9, 2025
పెరుగుతున్న ఎండు మిర్చి ధర

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News August 9, 2025
నేడు రాఖీ పౌర్ణమి.. ఇలా చేయండి

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి(నేడు)రోజున రాఖీ జరుపుకుంటాం. ఈ రోజు ఉ.9 గంటల నుంచి 10.30 వరకు రాఖీ కట్టడానికి సుముహూర్తం ఉంది. ఉదయాన్నే తల స్నానం చేసి దీపం వెలిగించాలి. పళ్లెంలో రాఖీ, వెండి నాణెం ఉంచి పూజ చేయాలి. అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. సోదరులు ప్రేమతో వారికి కానుకలు ఇవ్వాలి. కుటుంబ సంబంధాలను దృఢపరుచుకోవడమే ఈ పండుగ ఉద్దేశం.