News June 10, 2024

ట్రెండింగ్‌లో ‘ALL EYES ON REASI’

image

జమ్మూకశ్మీర్ రియాసిలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ALL EYES ON REASI’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘ALL EYES ON RAFAH’ అని పోస్టులు పెట్టిన సినీ సెలబ్రిటీలకు రియాసి ఉగ్రదాడి కనిపించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News December 22, 2024

రాహుల్ గాంధీ ఫ్యామిలీ లంచ్

image

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన కుటుంబంతో సరదాగా గడిపారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకలతో కలిసి లంచ్ చేశారు. అందులో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరయా కూడా ఉన్నారు. ఈ ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News December 22, 2024

సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి

image

TG: సంక్రాంతి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.

News December 22, 2024

ఆ దేశంతో టెస్టు సిరీస్ ఆడలేకపోయిన అశ్విన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని దేశాలతో టెస్టు మ్యాచులు ఆడారు. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మాత్రం ఒక్క టెస్టు కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య 2008 నుంచి టెస్టు సిరీస్ జరగలేదు. అశ్విన్ 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇరు దేశాల మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. దీంతో ఆయన ఆ దేశంతో ఆడలేకపోయారు.