News January 5, 2025
ట్రెండింగ్: OYO ROOMS
పెళ్లికాని జంటలు ఓయో రూమ్ బుక్ చేసుకునేందుకు వీలు లేకుండా <<15071369>>కొత్త చెక్-ఇన్ పాలసీ<<>> తేవడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను Xలో పంచుకుంటున్నారు. మైనర్లను ఆపొచ్చని, కానీ పెళ్లికాని మేజర్లను ఆపడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ పోస్టులు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓయో కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందంటున్నారు. అయితే సింగిల్స్కు ఇది అదిరిపోయే వార్త అని పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 7, 2025
హైకోర్టు తీర్పు.. దూకుడు పెంచిన ఏసీబీ
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోనూ గ్రీన్ కో, ఏస్ జెన్నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.
News January 7, 2025
జత్వానీ కేసులో IPSలకు ముందస్తు బెయిల్
AP: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీ, ACP హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.
News January 7, 2025
దేశంలో మరో 2 hMPV కేసులు
hMP వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.