News January 10, 2025

‘గాలి’పై కేసుల విచారణ 4 నెలల్లో పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు

image

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 30న సీబీఐకి 4 నెలల గడువు ఇవ్వగా, తాజాగా మరింత గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. దీంతో ధర్మాసనం మండిపడింది. మరో 4 నెలల్లో విచారణ పూర్తిచేయాలని, ఇకపై గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. 2011 నుంచి ఈ కేసుల విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2025

నేను 2 గంటలే నిద్రపోతా: జపాన్ ప్రధాని

image

జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రోజూ రాత్రి కేవలం 2 గంటలు, మహా అయితే 4 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. ఈ అలవాటు తన స్కిన్‌కు చేటు చేస్తుందని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం అధికారులతో 3am వరకు మీటింగ్ పెట్టడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. జపాన్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 16, 2025

APPLY NOW: MECLలో ఉద్యోగాలు

image

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<>MECL<<>>) 10 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, ఎంటెక్, MSc (జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/జియోఫిజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. UPSC-CGSE 2024 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mecl.co.in/

News November 16, 2025

వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

image

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>