News October 8, 2025

హైకోర్టులో తిరిగి ప్రారంభమైన విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. రిజర్వేషన్ల అమలు జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లకు నంబరింగ్ ఇవ్వలేదని మరో న్యాయవాది విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ, న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News October 8, 2025

నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2’

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.

News October 8, 2025

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

image

కెమిస్ట్రీ విభాగంలో ముగ్గురిని ప్రఖ్యాత నోబెల్-2025 బహుమతి వరించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ డెవలప్ చేసినందుకు గాను సుసుము కటీగవా(జపాన్), రిచర్డ్ రాబ్సన్(ఆస్ట్రేలియా), ఒమర్ ఎం.యాగీ(అమెరికా)ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇప్పటివరకు <<17929651>>మెడిసిన్<<>>, <<17939496>>ఫిజిక్స్<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా లిటరేచర్, ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్‌లు ప్రకటించాల్సి ఉంది.

News October 8, 2025

MBU ప్రతిష్ఠను దిగజార్చాలనే ఇవన్నీ: విష్ణు

image

మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా APHERMC చేసిన సిఫార్సులను మంచు విష్ణు ఖండించారు. ‘ఆ సిఫార్సులపై <<17943028>>MBU<<>>కు మద్దతుగా హైకోర్టు స్టే ఇచ్చింది. వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చాలనే కొంత సమాచారాన్నే ప్రచారం చేస్తున్నారు. ఈ నిరాధారమైన వార్తలను నమ్మొద్దని కోరుతున్నాం. ఎంతో మందికి ఉచిత విద్య అందించాం. అనాథలను దత్తత తీసుకుని సంరక్షించాం. ఆర్మీ, పోలీసుల పిల్లలకు పూర్తి స్కాలర్‌షిప్ ఇచ్చాం’ అని తెలిపారు.