News November 25, 2024
గిరిజన బిడ్డను బలితీసుకున్నారు: KTR

TG: ఆశ్రమ స్కూలు విద్యార్థిని శైలజ(16) <<14707996>>మృతిపై<<>> KTR విచారం వ్యక్తం చేశారు. ‘పెద్ద చదువుల కోసం గురుకులాల్లో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలితీసుకుంటివి. 20 రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతుంటే కనీసం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించలేదు. నీ పనితీరుతో అమాయకులు రాలిపోతున్నారు. CMగా నీకు పిల్లల బాధలు పట్టవా? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండె కరుగుతుంది రేవంత్’ అని Xలో KTR ప్రశ్నించారు.
Similar News
News December 8, 2025
అంజూ బాబీ జార్జ్.. ఎందరికో ఆదర్శం

మన దేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తొలి పతకం తెచ్చిన క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్. కేరళకు చెందిన అంజూ ఒక జన్యుపరమైన సమస్యతో ఒకే కిడ్నీతో జన్మించినా.. దాన్ని అధిగమించి ఎన్నో పతకాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News December 8, 2025
నేపాల్లో అతిపెద్ద అవినీతి కేసు.. ఫేక్ బిల్లులతో!

నేపాల్లో చైనా నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అవినీతి జరిగింది. దీనిని $216 మిలియన్లతో పూర్తి చేయగా ఇందులో $74M(రూ.600కోట్లు) అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. చైనా కాంట్రాక్టర్తో ఏవియేషన్ అధికారులు, మాజీ మంత్రులు(5) కుమ్మక్కై ఫేక్ బిల్లులతో ప్రాజెక్ట్ వ్యయాన్ని $74M పెంచారు. కాగా ఇలా ఫేక్ బిల్లులతో వ్యయాన్ని పెంచి ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 8, 2025
EC షెడ్లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్) షెడ్లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.


