News April 7, 2025
గిరిజన యువత గంజాయి సాగు వదిలేయాలి: పవన్ కళ్యాణ్

AP: మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వం ఇక్కడ రోడ్ల కోసం రూ.92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అల్లూరి జిల్లా పెదపాడు సభలో మాట్లాడుతూ ఇక్కడ తమకు ఓట్లు పడకపోయినా రూ.1,005 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజన యువత గంజాయి సాగు వదిలి టూరిజం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 7, 2025
రాష్ట్రానికి రూ.34,600 కోట్ల మద్యం ఆదాయం

TG: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7% విక్రయాలు పెరిగినట్లు స్పష్టం చేసింది. పన్నుల రూపంలో రూ.7,000 కోట్లు, దరఖాస్తుల ద్వారా 264 కోట్లు వచ్చాయంది. బీర్ల కంపెనీలు 15 రోజులు సరఫరా నిలిపివేయడంతో వీటి అమ్మకాలు 3% తగ్గినట్లు పేర్కొంది.
News April 7, 2025
4D PLAYER: 5 ఏళ్లలో ఆడింది 8 మ్యాచులే..!

న్యూజిలాండ్ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్కు IPL అస్సలు కలిసి రావడం లేదు. ఐదేళ్లుగా ఆయన IPLలో కొనసాగుతున్నా ఇప్పటివరకు 8 మ్యాచులే ఆడారు. RR-3, SRH-5, ప్రస్తుతం GT తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. ఫిలిప్స్ బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ అన్నిట్లోనూ అదరగొడుతున్నారు. ఆయన పట్టే క్యాచులకూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఫిలిప్స్కు ఏ ఫ్రాంచైజీ సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్?
News April 7, 2025
45 ఏళ్ల వయసులో గెలుపు.. చరిత్ర సృష్టించిన బోపన్న

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. ‘ATP మాస్టర్స్ 1000’ ఈవెంట్లో డబుల్స్ మ్యాచ్ గెలిచిన ఓల్డెస్ట్ ప్లేయర్(45 ఏళ్ల ఒక నెల)గా నిలిచారు. బోపన్న-షెల్టన్ జోడీ ఫ్రాన్సిస్కో- టబీలోపై 6-3, 7-5 తేడాతో విజయం సాధించింది. కాగా 2017లో కెనడాకు చెందిన డేనియల్ 44 ఏళ్ల 8 నెలల వయసులో ఫాబ్రిక్ మార్టిన్తో కలిసి మ్యాచ్ గెలిచారు. అది కూడా బోపన్న-పాబ్లో జోడీపై కావడం విశేషం.