News September 11, 2024
అటవీ అమరవీరులకు నివాళులు: పవన్

AP: అటవీ సంపదను పరిరక్షించడంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘APలో 37,421 చ.కి.మీ అమూల్యమైన అటవీ సంపదను రక్షించడంలో మన సిబ్బంది ముందంజలో ఉన్నారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. వారికి నివాళులర్పిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News January 10, 2026
‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం

బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.
News January 10, 2026
మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.
News January 10, 2026
కన్నవాళ్లే కాటికి పంపుతున్నారు

కొందరు తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని కాలరాస్తున్నారు. AP కృష్ణా(D)లో 45రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసింది. TG నారాయణపేట(D)లో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా రంగారెడ్డిలో ఓ తల్లి 11నెలల కొడుకును విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అత్త సూటిపోటి మాటలు, భార్యతో గొడవలు, భర్త వేధింపులు కారణమేదైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపడం కలవరపెడుతోంది.


