News May 2, 2024
రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్.. భర్త అరెస్ట్

ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేంద్రం చట్టం చేసిన తర్వాత కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా UPలోని కాన్పూర్‌లో అదనపు కట్నం తేలేదని భార్యకు కదులుతున్న రైలులో భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తర్వాత ఆమెపై దాడి చేసి రైలు నుంచి దూకి పారిపోయాడు. దీంతో బాధితురాలు CM యోగి ఆదిత్యనాథ్‌కు వీడియో ద్వారా ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.