News May 24, 2024
‘పుష్ప 2’లో త్రిప్తి దిమ్రీ ఐటెమ్ సాంగ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’లో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిప్తి ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు టాక్. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Similar News
News December 20, 2025
ఒత్తిడిని జయించేలా మీ పిల్లలను తీర్చిదిద్దండి!

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితమై చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే పిల్లలకు చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (క్రీడలు, సంగీతం, పెయింటింగ్ వంటివి) నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో అద్భుత ప్రతిభ కనబరచకపోయినా నిత్యం సాధన చేయడం వల్ల వారిలో క్రమశిక్షణ, ఓర్పు పెరుగుతాయంటున్నారు. వారు మానసికంగా కూడా దృఢంగా తయారవుతారట.
News December 20, 2025
తెలుగు బిగ్ బాస్: ఇద్దరు ఎలిమినేట్?

తెలుగు బిగ్ బాస్ సీజన్-9 తుది అంకానికి చేరింది. టాప్-5 కంటెస్టెంట్లలో నటి సంజన, కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. టాప్-3లో కళ్యాణ్, తనూజ, డెమాన్ ఉన్నారని సమాచారం. వీరిలో ఇద్దరు ఫినాలేకు చేరనున్నారు. రేపు విన్నర్ ఎవరో తెలియనుంది. విజేతగా ఎవరు నిలుస్తారో కామెంట్ చేయండి.
News December 20, 2025
అన్ని మతాలు మాకు సమానమే: సీఎం రేవంత్

TG: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని CM రేవంత్ చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.


