News February 2, 2025
త్రిష తెలంగాణకు గర్వకారణం: రేవంత్

TG: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
Fact Check: పాత ₹500, ₹1,000 నోట్లు మార్చుకోవచ్చా?

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.
News November 7, 2025
15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.


