News March 31, 2024
నయనతారను దాటేసిన త్రిష!

పొన్నియన్ సెల్వన్ ముందు వరకు నెమ్మదించిన త్రిష కెరీర్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. విజయ్ లియో సినిమాలో రూ.6 కోట్లు తీసుకున్న ఆమె, కమల్ ‘థగ్ లైఫ్’కు ఏకంగా రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలో తోటి స్టార్ నయనతారను దాటేశారని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం అజిత్ ‘విడాముయర్చి’, మెగాస్టార్ ‘విశ్వంభర’, మోహన్‌లాల్ ‘రామ్’, నివీన్ పౌలీ ‘ఐడెంటిటీ’ సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.
Similar News
News January 22, 2026
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్‌కేనా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 22, 2026
సౌతాఫ్రికా WC జట్టులో మార్పులు

T20 WC జట్టులో SA మార్పులు చేసింది. బ్యాటర్లు జోర్జి, ఫెరీరా గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారని, వారి స్థానాల్లో స్టబ్స్, రికెల్టన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు మిల్లర్ కండరాల గాయంతో బాధపడుతున్నారని, ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే ఆయన WCలో ఆడతారని తెలిపింది.
టీమ్: మార్క్రమ్(C), బాష్, బ్రెవిస్, డికాక్, జాన్సెన్, లిండే, కేశవ్, మఫాకా, మిల్లర్, ఎంగిడి, నోర్ట్జే, రబాడ, రికెల్టన్, స్మిత్, స్టబ్స్
News January 22, 2026
చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’

ర్యాన్ క్లూగర్ డైరెక్షన్‌లో మైఖేల్ బి.జోర్డాన్ నటించిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్‌లో 16 కేటగిరీల్లో చోటు దక్కించుకుంది. గతంలో All About Eve(1950), Titanic(1997), La La Land(2016) 14 కేటగిరీల చొప్పున నామినేషన్స్‌లో నిలిచాయి. ఇప్పుడు వాటి రికార్డును సిన్నర్స్ బద్దలుకొట్టింది. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ అందుకుంది.


