News February 2, 2025
ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష

అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్‌గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.
Similar News
News November 12, 2025
భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.
News November 12, 2025
బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

బ్యాంకు సర్వీస్‌లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE
News November 12, 2025
ట్రాఫిక్‌లోనే 117 గంటల జీవితం

వాహనాల ట్రాఫిక్‌లో బెంగళూరు దేశంలోనే టాప్‌లో నిలిచింది. అక్కడ ఒక్కో ప్రయాణికుడు ఏడాదిలో సగటున 117 గంటలు ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా(110), పుణే(108), ముంబై(103), చెన్నై(94), హైదరాబాద్(85), జైపూర్(83), ఢిల్లీ(76), అహ్మదాబాద్(73) ఉన్నాయి. ఇక 10KM ప్రయాణానికి బెంగళూరులో 34ని.10 సెకన్లు పడుతుండగా, HYDలో 31ని.30 సెకన్లు పడుతున్నట్లు తేలింది.


