News March 26, 2024
మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం: పురందీశ్వరి

AP: అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరమని, ఇదొక త్రివేణి సంగమమని అభివర్ణించారు. వైసీపీ నేతలు అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. ‘నా ఎస్సీ, ఎస్టీ, బీసీలని చెప్పే సీఎం జగన్.. ఆయా వర్గాల నిధులను దారి మళ్లించారు’ అని మండిపడ్డారు.
Similar News
News April 3, 2026
TODAY HEADLINES

*అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం. BRS మద్దతు, వ్యతిరేకించిన YCP
*పవిత్ర మట్టికి CBN సాష్టాంగ నమస్కారం
*TG:రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారుల ఎంపిక
*TG:గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్
*‘మావిగన్’ పేరుతో సినిమా టైటిల్ రిజిస్టర్?
*ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!
*KKRతో మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం
News April 3, 2026
ప్రభుత్వాలు నడిచేది లిక్కర్ ఆదాయం మీదేనా?

TG: ప్రభుత్వాల ఆదాయానికి మద్యం అమ్మకాలు ఊపిరిగా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.40,209 కోట్ల రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్క ఏడాదిలోనే ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది కంటే ఈసారి రూ.2,700 కోట్లకు పైగా అధికంగా విక్రయాలు జరిగాయి. దీన్నిబట్టి లిక్కరే ప్రభుత్వాలకు బంగారు బాతు అని స్పష్టం అవుతోంది.
News April 3, 2026
బంగారం, వెండి లేవు.. 10 కేసులున్నాయి: అఫిడవిట్‌లో ఉదయనిధి

తనకు ₹20.64 కోట్ల ఆస్తి ఉందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. అయితే తన వద్ద ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య పేరిట ₹13.25 కోట్ల అసెట్స్ ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయని చెప్పారు. చెన్నైలోని చెపాక్-తిరువల్లికేణి డీఎంకే అభ్యర్థిగా ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.


