News January 5, 2025

త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘త్రివిక్రమ్‌పై చాలాకాలం కిందట MAAలో ఫిర్యాదుచేశా. అయినా అతడిని ప్రశ్నించలేదు.. చర్యలు తీసుకోలేదు. నా ఆరోగ్యం, సంతోషాన్ని నాశనం చేసిన అతడిని పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త్రివిక్రమ్ తనతోపాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

Similar News

News January 7, 2025

స్పౌజ్ కేటగిరీ పెన్షన్‌పై వారిలో ఆందోళన!

image

AP: పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో భార్యకు ఇస్తున్న పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు, నవంబర్ 1- డిసెంబర్ 15 మధ్య 23K మంది చనిపోతే, స్పౌజ్ పెన్షన్లు 5K మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

News January 7, 2025

నేటి నుంచి విధుల్లోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. Dy.CM భట్టితో చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.

News January 7, 2025

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS వర్తింపు

image

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి భాగస్వామికి EHSలో వైద్య సదుపాయం ఉండేది. 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈ సదుపాయం లేకుండా పోయింది. దీనిపై ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.