News June 4, 2024
Troll: ముద్రగడ పద్మనాభం కాదు.. ముద్రగడ పద్మనాభ రెడ్డి

కాపు ఉద్యమ నేత ముద్రగడ <<13375442>>పద్మనాభం<<>> పేరును మార్చే నూతన నామకరణ మహోత్సవానికి కాపు యువత సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీలోని కిర్లంపూడిలో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆహ్వాన పత్రికను నటుడు బ్రహ్మాజీ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వాలని కోరారు.
Similar News
News January 30, 2026
మున్సి’పోల్స్’.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఈరోజు సా.5 గంటలకు ముగియనుంది. రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 3,379, BRS 2,506, BJP 1,709, BSP 142, CPI(M) 88, MIM 166, AAP 17, TDP నుంచి 10 ఉన్నట్లు తెలిపింది. తొలి రోజు వచ్చిన వాటితో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కి చేరింది. చివరి రోజు మరింత పెరిగే ఛాన్సుంది.
News January 30, 2026
ఇన్‌స్టాగ్రామ్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్‌లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్‌స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
News January 30, 2026
ఊపిరితిత్తులు లేకుండా 48 గంటలు బతికాడు!

ఓ 33 ఏళ్ల వ్యక్తి లంగ్స్ లేకుండా 48hrs బతికాడు. చికాగో నార్త్‌వెస్టర్న్ వర్సిటీ వైద్యులు ఆర్టిఫిషియల్ లంగ్ సిస్టమ్‌ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ గుండెకి రక్త ప్రసరణ చేయడంతో ఇది సాధ్యమైంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వల్ల రోగి లంగ్స్ పూర్తిగా పాడవడంతో డాక్టర్లు వాటిని తొలగించారు. 48hrs తర్వాత డోనర్ దొరకడంతో విజయవంతంగా డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు Med జర్నల్ పేర్కొంది.


