News September 29, 2024

‘ఆదిపురుష్‌’పై ట్రోలింగ్ వల్ల ఏడ్చాను: రచయిత

image

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ మూవీపై నెట్టింట జరిగిన ట్రోలింగ్ సినిమా టీమ్ అందర్నీ ప్రభావితం చేసిందని గేయ, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ తెలిపారు. ‘ట్రోలింగ్‌తో ఏడ్చాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. తిరిగి నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

త్వరగా నిద్ర పట్టాలంటే..

image

మారిన ఆహారపు అలవాట్లతో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు.
*పడుకునే ముందు కంప్యూటర్, ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. దీంతో కళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
*బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ఉదయం గంటసేపు వర్కౌట్స్ చేయాలి.
*లైటింగ్, సౌండ్ లేకుండా చూసుకోవాలి.
*రాత్రి భోజనంలో ఆకుకూరలు, కివీ పండ్లు, డెయిరీ పదార్థాలు ఉండేలా చూసుకోండి.

News September 30, 2024

బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..

image

TG: మిరపకాయ బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని కాగుతున్న నూనెను యజమానిపై పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మం. గువ్వలదిన్నెలో జరిగింది. నిన్న రాత్రి వినోద్ అనే వ్యక్తి ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు ఇవ్వాలని, డబ్బులు మళ్లీ ఇస్తానని అడిగాడు. యజమాని బుజ్జన్న గౌడ్ ఇవ్వనని చెప్పడంతో వినోద్ కోపంతో పొయ్యిపై కాగుతున్న నూనెను అతడిపై పోశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిపై కూడా పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

News September 30, 2024

డయాబెటిస్‌కు ఔషధం తీసుకొచ్చిన చైనా?

image

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డయాబెటిస్‌కు ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. షిన్హువా వార్తాసంస్థ ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్-1 డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించారు. టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ వర్సిటీ వైద్యులు ఈ పరిశోధన నిర్వహించారు. 11 ఏళ్లుగా మధుమేహం ఉన్న రోగికి స్టెమ్ సెల్ మార్పిడి చేయగా 75 రోజులకి డయాబెటిస్ పూర్తిగా మాయమైంది.