News October 17, 2024

భారత కోచ్ గౌతమ్ గంభీర్‌పై ట్రోలింగ్

image

బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత కోచ్ గౌతమ్ గంభీర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఒకేరోజులో 400 రన్స్ కొట్టాలన్నా, 2 రోజుల పాటు ఆడాలన్నా చేయగలిగే జట్టులా ఉండాలని మేం కోరుకుంటున్నాం. టెస్టు క్రికెట్ విషయంలో అటువంటి మార్పు టీమ్‌లో రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్‌గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

News September 14, 2025

ASIA CUP: ట్రెండింగ్‌లో Boycott INDvPAK

image

ఆసియాకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో SMలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్‌ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 14, 2025

పెదాలు అందంగా ఉండాలంటే

image

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్‌కేర్‌లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్‌గ్లాస్‌లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్‌స్టిక్‌కి జత చేస్తే పెదాలు ఎక్స్‌ట్రా షైనీగా ఉంటాయి. లిప్‌ఆయిల్స్‌లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్‌బామ్‌ కంటే ఎక్కువ హైడ్రేషన్‌ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.