News March 24, 2024
మిచెల్ స్టార్క్‌పై నెట్టింట ట్రోలింగ్!

ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కేకేఆర్ జట్టు మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. అయితే, నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ తన 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన ఐపీఎల్ కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలు కావడం గమనార్హం. దీంతో KKRపై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంత డబ్బు పోసి కొనుక్కున్నది ఇలా ధారాళంగా పరుగులిచ్చేందుకా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?

ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. ఉప్పును ఎడమ చేత్తో తీసుకుని బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దీంతో ఉప్పు బిడ్డలోని ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. అలాగే బిడ్డపై ఉన్న చెడు ప్రభావం పోతుందని అంటారు. అనంతరం ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఈ ప్రక్రియ బిడ్డకు దృష్టిని మళ్లించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మార్గమని మరికొందరు అంటారు.
News December 28, 2025
భారత్‌కు హాదీ హంతకులు.. ఖండించిన BSF

బంగ్లాదేశ్ యువనేత హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లోకి ప్రవేశించారన్న <<18694542>>ప్రచారాన్ని<<>> మేఘాలయ పోలీసులు, BSF ఖండించాయి. కాగా నిందితులు భారత్‌లోకి వచ్చి తురా సిటీకి చేరుకున్నారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే దీనిపై భారత్‌కు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదన్నారు. అదే విధంగా స్థానికులు, టాక్సీ డ్రైవర్ పాత్రపై కూడా ఆధారాల్లేవన్నారు. అయినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.
News December 28, 2025
కేసీఆర్ వస్తున్నారా?

TG: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే సభకు హాజరయ్యేది, లేనిది ఇవాళ రాత్రిలోపు క్లారిటీ రానుంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, ఆయన ప్రసంగం వినడానికి ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మీరేమంటారు?


