News August 23, 2024
ట్రోల్స్.. ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసిన అయేషా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724404985444-normal-WIFI.webp)
తనపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నటి అయేషా టాకియా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. నీలిరంగు చీరతో ఒక ఫొటోను ఇన్‌స్టాలో <<13916734>>పోస్టు<<>> చేయగా దానిపై భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. ‘అందంగా ఉన్నారు. కానీ నేచురల్ బ్యూటీనే బెస్ట్’ వంటి కామెంట్స్ ఎక్కువగా కనిపించాయి. ఆ తర్వాత ఆమె తన అకౌంట్ డిలీట్ చేశారు. మారిన రూపురేఖల కారణంగా అయేషా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులోనూ తనిఖీల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Similar News
News February 14, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739467502547_893-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 14, 2025
శుభ ముహూర్తం (14-02-2025)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739464961223_893-normal-WIFI.webp)
✒ తిథి: బహుళ విదియ రా.8.55 వరకు
✒ నక్షత్రం: పుబ్బ రా.10.54 వరకు
✒ శుభ సమయం: ఉ.9.26 నుంచి ఉ.9.56, సా.4.26-సా.4.38
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.7.13 వరకు
✒ అమృత ఘడియలు: మ.3.56 నుంచి సా.5.40 వరకు
News February 14, 2025
గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739468288557_1045-normal-WIFI.webp)
భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.