News September 12, 2024
‘దేవర’పై ట్రోల్స్.. విశ్వక్సేన్ స్ట్రాంగ్ రిప్లై

‘దేవర’ ట్రైలర్ తనకు చూడాలి అనిపించలేదని, అందులో ఎన్టీఆర్ బాలేడని విశ్వక్సేన అనే ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేశారు. తన అభిమాన హీరోని ఇలా అనేసరికి హీరో విశ్వక్ సేన్ సీరియస్ అయ్యారు. ‘నాపేరు కరాబ్ చేయడానికే వీడు పుట్టాడు. ముందు గోడ సపోర్ట్ లేకుండా కూర్చో. తర్వాత సినిమా, ఆడియన్స్ని ఉద్దరిద్దువు. కాలుతుంది నాకు. కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది. నువ్వే మాట్లాడాలి అందం గురించి’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News November 3, 2025
పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని బ్రాంకియోలైటిస్ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దలకూ రావొచ్చు. 3,4 రోజుల తర్వాత లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వచ్చి, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్లో ఉంచే వైద్యం చేయాలి.
News November 3, 2025
KTR .. నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా: పొంగులేటి

TG: తన <<18177278>>ఇల్లు<<>> FTL పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పడగొడతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లేకపోతే అప్పా జంక్షన్లో ముక్కు నేలకు రాస్తారా? అంటూ KTRకు ప్రతి సవాల్ చేశారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. 500 రోజుల్లో అధికారంలోకి వస్తామన్న మాటల వెనుక BRS ఆలోచన ఏంటో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గులాబీ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
News November 3, 2025
RSV ఇన్ఫెక్షన్ను ఎలా నివారించాలంటే?

వర్షాకాలం, చలికాలంలో ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.


