News January 31, 2025
బంగాళాఖాతంలో ద్రోణి.. రేపు వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించినట్లు IMD వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు, కోస్తా మీదుగా తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో పగటిపూట వాతావరణం చల్లగా మారినట్లు పేర్కొంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
Similar News
News January 3, 2026
చైనా సైన్యాన్ని మోహరిస్తుందేమో.. జైశంకర్‌కు బలూచ్ నేత లేఖ

పాక్‌తో చైనా పొత్తు మరింత బలపడుతోందని బలూచిస్థాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ‘బలూచ్ డిఫెన్స్-ఫ్రీడమ్ ఫోర్సెస్‌ను బలోపేతం చేయకపోతే ఇక్కడ చైనా సైన్యాన్ని మోహరించే అవకాశం ఉంది. ఇది మాకు, ఇండియాకు ముప్పు’ అని పేర్కొన్నారు. భారత్, బలూచ్ మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించారు.
News January 3, 2026
వాట్సాప్‌లో న్యాయ సలహాలు, సమాచారం

కేంద్ర ప్రభుత్వం ‘న్యాయ సేతు’ సేవలను వాట్సాప్‌లోనూ అందిస్తోంది. 7217711814 నంబర్‌కి HI అని మెసేజ్ చేయగానే ‘Tele-Law’ చాట్‌బాట్ లీగల్ హెల్ప్/ఇన్ఫర్మేషన్/అసిస్టెన్స్ ఆప్షన్లు చూపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సేవలు పొందవచ్చు. ప్రజలకు లీగల్ హెల్ప్ అందించేందుకు 2024లో కేంద్రం ‘న్యాయ సేతు’ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాని సేవలను వాట్సాప్‌కు ఎక్స్టెండ్ చేసింది.
News January 3, 2026
వరి మాగాణి మినుములో ఆకుమచ్చ తెగులు – నివారణ

ఆకుమచ్చ తెగులు సోకిన మినుము మొక్కల ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి తర్వాత పెద్ద మచ్చలుగా వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా హెక్సాకోనజోల్‌ను 2.0 మి.లీటర్లను 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి. ముందుగా గట్ల మీద ఉన్న పైరుకు ఈ మందును పిచికారీ చేయాలి.


