News June 15, 2024
స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ చర్యలు

స్పామ్ కాల్స్‌ను అదుపు చేసేందుకు ట్రాన్సాక్షన్, సర్వీస్ వాయిస్ కాల్స్‌కు ‘160 సిరీస్’ను కేటాయిస్తున్నట్లు TRAI ప్రకటించింది. దీంతో కాలర్లను గుర్తించడం యూజర్లకు సులువు అవుతుందని తెలిపింది. RBI, SEBI, IRDAI, PFRDA పరిధిలోని సంస్థలకు తొలుత ట్రాయ్ ఈ సిరీస్ కేటాయించింది. డిజిటల్ కన్సెంట్ మెకానిజమ్స్ (యూజర్ల అనుమతి ఉంటేనే యాడ్ కాల్స్/SMS వెళ్లే విధానం)పై క్షేత్రస్థాయిలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News November 24, 2025
ఐబొమ్మ రవి ఎలా చిక్కాడంటే?

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు అతడు వెబ్సైట్లకు సంబంధించి ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక రవి అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్‌కు రమ్మంటూ తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.
News November 24, 2025
నకిలీ వెబ్సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.


