News March 10, 2025
కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
రష్మిక మందన్నకు ప్రాణభయం: కొడవ వర్గం ఆందోళన

నటి రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని విమర్శించారు. ఆమెకు ముప్పు ఉందని, ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల KA <<15639271>>MLA <<>>ఒకరు ఆమెకు తగిన బుద్ధి చెప్తామని బెదిరించడం తెలిసిందే. KAలోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యం. సంప్రదాయ హిందువులైన వీరు కొడవ భాష మాట్లాడతారు. రష్మిక ఈ వర్గానికే చెందుతారు.
News March 10, 2025
భారత్ బ్రహ్మాస్త్రం: గంటలో USను చేరగల వేగం!

భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144 KMPH వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. అంటే ఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కు గంటలో చేరగల వేగమిది. ఈ లాంగ్‌రేంజ్ యాంటీషిప్ మిసైల్ (LRAShM)ను 2023, NOV 16న విజయవంతంగా పరీక్షించిన DRDO తాజాగా మరోసారి సత్తా చూపింది. ఇది ధ్వని కన్నా 10రెట్లు అంటే సెకనుకు 3.37KM, ముంబై నుంచి కరాచీకి 5ని.ల్లో వెళ్లగలదు. చైనా, US కన్నా ఇదే బెస్ట్.
News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు నిందితులు వీరే

A1 మారుతీరావు (అమృత తండ్రి), A2 సుభాష్ శర్మ(బిహార్), A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం సాయంతో అస్గర్‌కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో <<15710208>>ప్రణయ్‌ను<<>> హత్య చేయించాడు.