News March 4, 2025

ట్రంప్‌తో ట్రూడో ఢీ: ప్రతీకార టారిఫ్స్‌ ప్రకటన

image

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News March 27, 2026

ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.

News March 27, 2026

వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

image

మేకప్‌ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్‌ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్‌ వాషర్‌ సోప్‌, యాంటి బ్యాక్టీరియల్‌ సోప్‌, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.

News March 27, 2026

జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

image

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.