News March 11, 2025

కెనడా పార్లమెంటు నుంచి కుర్చీ ఎత్తుకెళ్లిన ట్రూడో

image

కెనడా ప్రధాని, ఎంపీ పదవులకు వీడ్కోలు పలుకుతూ జస్టిన్ ట్రూడో ప్రదర్శించిన సరదా చేష్టలు వైరల్‌గా మారాయి. నాలుక బయటకు చాపుతూ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి తన కుర్చీని ఆయన ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. ఈ చర్య అసంతృప్తి, ప్రతీకారంతో చేసింది కాదు. పదవి నుంచి దిగిపోయేటప్పుడు అక్కడ ఇలా చేయడం ఓ సరదా ఆనవాయితీ అని తెలిసింది. కెనడా తర్వాతి ప్రధానిగా మార్క్ కార్నీని లిబరల్ పార్టీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 12, 2025

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

image

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

News March 12, 2025

పాత సెల్‌ఫోన్లు అమ్మేస్తున్నారా?

image

పాత సెల్‌ఫోన్లు కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బిహార్ ముఠాను ADB సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,125 సెల్‌ఫోన్లు, 107 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ‘చాలామంది పాత ఫోన్లలో సిమ్‌లు అలాగే ఉంచి అమ్మేస్తున్నారు. వాటితో నిందితులు సైబర్ నేరాలు చేస్తున్నారు. ఫలితంగా అమ్మినవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత ఫోన్లు అమ్మే ముందు జాగ్రత్త పడండి’ అని పోలీసులు సూచించారు.

News March 12, 2025

త్వరలో భారత్‌కు జేడీ వాన్స్!

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెలాఖరులో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఉషను జేడీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ జంట భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పదవి చేపట్టిన తర్వాత జేడీ వాన్స్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. ఇటీవల ఆయన ఫ్రాన్స్, జర్మనీలో పర్యటించారు.

error: Content is protected !!