News November 8, 2024

ట్రూడో ఓడిపోవడం ఖాయం: ఎలాన్ మస్క్

image

ఇండియాతో తగువులతో వార్తల్లో నిలుస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని అంచనా వేశారు. జర్మనీలో సోషలిస్ట్ ప్రభుత్వం <<14553363>>కూలిపోతోందని<<>> ఒకరు, ఇలాగే కెనడాలోనూ ట్రూడోను తొలగించడానికి మీ సాయం కావాలని మరొకరు ట్వీట్ చేయగా మస్క్ స్పందించారు. కాగా కెనడాలో 2025 అక్టోబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 6, 2026

చెక్ బౌన్స్ సమన్లు.. వాట్సాప్‌లోనూ పంపొచ్చు: ఉత్తరాఖండ్ హైకోర్టు

image

చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సమన్లపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫిజికల్‌గానే కాకుండా ఇకపై ఈమెయిల్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా సమన్లను పంపవచ్చని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నిందితుడి వ్యక్తిగత ఈమెయిల్, వాట్సాప్ వివరాలను అఫిడవిట్ ద్వారా సమర్పించాలని పేర్కొంది. ఆటోమేటిక్‌గా సమన్లు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.

News January 6, 2026

USలో ఏటా రూ.63 లక్షల కోట్ల ఫ్రాడ్: మస్క్

image

US మిన్నెసోటాలో ‘<<18728357>>డే కేర్ సెంటర్ల<<>>’ పేరిట $100 బిలియన్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందన్న వార్తలపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నెసోటా కంటే కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఫ్రాడ్ చాలా పెద్దది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఏటా $700 బిలియన్స్(సుమారు రూ.63 లక్షల కోట్లు) స్కామ్ జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News January 6, 2026

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ‘ఇన్‌బిల్ట్ GPS’ సీక్రెట్!

image

ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పుట్టిన తీరానికే తిరిగొచ్చి గుడ్లు పెట్టడానికి ‘జియోమాగ్నెటిక్ ఇంప్రింటింగ్’ ప్రధాన కారణం. తీరానికి ఉండే ప్రత్యేక అయస్కాంత తీవ్రత, కోణాన్ని ఇవి పుట్టినప్పుడే మెదడులో నిక్షిప్తం చేసుకుంటాయి. ఈ ఇన్‌బిల్ట్ GPS సాయంతో వేల కి.మీ దూరం నుంచి గమ్యాన్ని గుర్తిస్తాయి. ఇసుక వాసన, నీటి రసాయన గుణాలు, ఖనిజాల సంకేతాలూ అందుకు సాయపడతాయి. అందుకే అవి కచ్చితంగా ఒడిశా, AP తీరానికి వస్తాయి.