News October 14, 2024
ఎన్నికల కోసమే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్

కెనడాలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జర్ హత్యను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెనడాలో ఇటీవల జీవన వ్యయాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబల్యం ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదుల మద్దతు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.
Similar News
News January 16, 2026
మరియా గొప్ప మహిళ: ట్రంప్

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
News January 16, 2026
క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
News January 16, 2026
కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.


