News March 15, 2025
సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
అండమాన్లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News November 21, 2025
మూవీ ముచ్చట్లు

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్బాస్ సీజన్-12పై మహిళా కమిషన్కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్లో టాక్
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.


