News October 21, 2024

ట్రంప్.. మీరు ఫిట్‌గా ఉన్నారా?: కమలా హారిస్

image

అత్యంత కష్టమైన అమెరికా అధ్యక్ష పదవిలో పనిచేసేంత ఫిట్‌గా ట్రంప్ ఉన్నారా అంటూ కమలా హారిస్ తాజాగా ప్రశ్నించారు. అలసిపోవడం వల్ల పలు ఇంటర్వ్యూలను ట్రంప్ రద్దు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ప్రచారంలోనే అలసిపోయే మీరు అధ్యక్ష పదవికి అర్హులేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి’ అని విమర్శించారు. మరోవైపు.. కమలకు కనీసం కుందేలుకున్న ఎనర్జీ కూడా లేదంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.

Similar News

News January 28, 2026

మేడారం చేరుకోండిలా!

image

మేడారం మహాజాతర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకునేందుకు RTC ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. రైల్వేశాఖ కూడా వరంగల్, ఖాజీపేట వరకూ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. అక్కడి నుంచి బస్సులుంటాయి. HYD నుంచి సొంత వాహనాల్లో వెళ్లేవారు WGL హైవే మీదుగా గూడెప్పాడ్ X రోడ్, కటాక్షపూర్, ములుగు, పస్రా నుంచి మేడారం చేరుకోవచ్చు. ఏటూరునాగారం నుంచి తాడ్వాయి X రోడ్డు ద్వారా తల్లుల గద్దెల వద్దకు వెళ్లొచ్చు.

News January 28, 2026

ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

image

AP: పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెల పెన్షన్‌ను జనవరి 31వ తేదీనే పంపిణీ చేయనుంది. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జనవరి 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే.

News January 28, 2026

రిటైర్మెంట్ వెనుక కారణం చెప్పిన అర్జిత్ సింగ్

image

బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు <<18977435>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త తరం గాయకులకు అవకాశాలు కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. సినిమాలకు గుడ్‌బై చెప్పినా, ఇండిపెండెంట్ సింగర్‌గా తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.