News November 10, 2024
13న ట్రంప్, బైడెన్ భేటీ!
US అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13న శ్వేతసౌధంలో భేటీ అవుతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. పదవి నుంచి తప్పుకొనే అధ్యక్షుడు, కొత్తగా పదవిలోకి వచ్చే అధ్యక్షుడితో సమావేశమై కీలక వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. ట్రంప్నకు అధికార బదలాయింపు ప్రక్రియ జనవరిలో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా తాను చూసుకుంటానని బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News December 26, 2024
ఇండియాలో లక్షలో 96 మందికి క్యాన్సర్
మారిన జీవనశైలితో వేలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెన్మార్క్ దేశంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. లక్ష మందిలో 335 మందికి క్యాన్సర్ సోకుతోంది. దీని తర్వాత ఐర్లాండ్(326), బెల్జియం(322), హంగేరీ(321), ఫ్రాన్స్(320), నెదర్లాండ్స్(315), ఆస్ట్రేలియా(312), నార్వే(312), స్లోవేనియా(300), అమెరికా(297) ఉన్నాయి. ఇక లక్షలో 96 మంది క్యాన్సర్ బాధితులతో ఇండియా 163వ స్థానంలో ఉంది. SHARE IT
News December 26, 2024
సోనియా గాంధీకి అస్వస్థత?
ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్లో సోనియా పాల్గొనాల్సి ఉంది. కానీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెతోపాటు ప్రియాంకా గాంధీ కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాత్రమే పాల్గొన్నారు.
News December 26, 2024
పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
TG: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న <<14906777>>ప్రచారంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్పై ఉంది కదా?’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని రేవంత్ పేర్కొన్నారు.