News February 22, 2025
ట్రంప్ బాంబు: USAID డబ్బులిచ్చింది భారత్‌కే

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ బాంబు పేల్చారు. ఓటింగ్ పెంచేందుకు USAID $21M కేటాయించింది భారత్‌కేనని వరుసగా మూడోరోజూ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు ప్రత్యేకంగా $29M ఇచ్చారని చెప్పారు. USAID డబ్బులిచ్చింది భారత్‌కు కాదని బంగ్లాకని నిన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన కథనాన్ని కొందరు జర్నలిస్టులు, ఫ్యాక్ట్‌చెకర్లు విపరీతంగా ప్రచారం చేశారు. దానిని ఖండిస్తున్నట్టుగా ట్రంప్ వేర్వేరుగా వివరాలు చెప్పడం గమనార్హం.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


