News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2025
తులసి పూజ సమయంలో చదవాల్సిన మంత్రం

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:||
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే|
నమో మోక్షప్రదే దేవి నమ: సంపత్ర్పదాయిని||
ఈ మంత్రాన్ని చదువుతూ తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి. <<-se>>#Shlokam<<>>
News October 7, 2025
నీట మునిగిన మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొలంలో నీటిని బయటకు పంపాలి. వడలిన మొక్కలకు లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లుంటే 10 లీటర్ల నీటికి 50గ్రా. అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు తేరుకున్నాక లీటరు నీటికి 5గ్రా. స్థూలపోషకాల మిశ్రమం, లీటరు నీటికి 2.5గ్రా. సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం వ్యవధిలో 2,3సార్లు పిచికారీ చేయాలి.
News October 7, 2025
ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!

AP: విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.