News August 26, 2025

చైనా, నార్త్ కొరియాతో దోస్తీపై ట్రంప్ ఫోకస్

image

ప్రపంచమంతా తాను చెప్పినట్టే నడవాలనుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా, నార్త్ కొరియాపై కన్నేశారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ప్రకటించారు. తన వద్ద కొన్ని వ్యూహాలున్నాయని, అవి అమలు చేస్తే ఆ దేశం నాశనమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కానీ తాను అలా చేయనన్నారు. నార్త్ కొరియా నియంత కిమ్‌తోనూ ఈ ఏడాది భేటీ అవుతానని తెలిపారు. వీరిద్దరూ చివరిసారి 2019లో సమావేశమయ్యారు.

Similar News

News August 26, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

image

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News August 26, 2025

BCCI స్పాన్సర్‌గా TOYOTA?

image

టీమ్ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు జపాన్ ఆటోమేకర్ టయోటా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కూడా స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు BCCI అధికారిక బిడ్డింగ్ మొదలుపెట్టలేదు. అటు SEP 9న మొదలయ్యే ఆసియా కప్‌లోపు స్పాన్సర్ దొరకడం దాదాపు కష్టమే.

News August 26, 2025

సెలవులు ఇవ్వాల్సిందే: మహిళా కమిషన్

image

TG: వినాయక చవితి, ఇతర పండుగలు, ఆదివారాల్లో జూనియర్ కాలేజీల విద్యార్థులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఇంటర్ బోర్డుకు సూచించింది. రేపు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సెలవు ప్రకటించినా కొన్ని కాలేజీలు పాటించట్లేదంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద ఇంటర్ బోర్డుకు సూచనలు చేశారు. రేపు మీకు సెలవు ఉందా?