News December 23, 2024
మరో భారతీయ అమెరికన్‌కు ట్రంప్ కీలక పదవి
మరో భారతీయ అమెరికన్‌కు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవిని కట్టబెట్టారు. ఆంత్రప్రెన్యూర్, VC, రచయిత శ్రీరామ్ కృష్ణన్‌ను AIపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుగా ఎంపిక చేశారు. ‘AI, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అనేక అంశాల విధాన రూపకల్పనలో డేవిడ్ సాక్స్‌తో కలిసి శ్రీరామ్ కృష్ణన్ పనిచేస్తారు’ అని ట్రంప్ తెలిపారు. మైక్రోసాఫ్ట్, ట్విటర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్‌లో నాయకత్వ బాధ్యతల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
Similar News
News December 23, 2024
పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
UPSC నుంచి బహిష్కరణకు గురైన పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సివిల్స్‌లో ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం సర్వీసు నుంచి తొలగించింది. ప్రతిష్ఠాత్మక సంస్థను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను కూడా కోర్టు తొలగించింది. త్వరలో ప్రభుత్వం ఆమెను విచారించే అవకాశం ఉంది.
News December 23, 2024
అల్లు అర్జున్ మామ వచ్చినట్లు మాకు తెలియదు: మహేశ్ కుమార్
TG: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినట్లు తమకు తెలియదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయనొచ్చిప్పుడు తాము ప్రెస్‌మీట్లో ఉన్నామన్నారు. తర్వాత చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. AAతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని మహేశ్ మరోసారి స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన చంద్రశేఖర్‌ను మున్షీ మాట్లాడకుండానే పంపించేశారు.
News December 23, 2024
బంగారం ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.84 పెరిగి రూ.80,777గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.77 ఎగిసి 74,045 వద్ద కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పెరగడంతో కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 వారాల్లోనే బాగా తగ్గడంతో నేడు స్తబ్ధత నెలకొంది. ఇక వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.91,400 వద్ద చలిస్తోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 పెరిగి రూ.25,500 వద్ద ఉంది.