News February 3, 2025

సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్

image

దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2026

₹20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్‌షిప్!

image

సమ్మర్‌లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 15వ తేదీ వరకు <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చని సూచించింది. B.Tech, LLB, BA, B.Com, MBA తదితర కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు. మే 4-జులై 5 వరకు ఈ ఇంటర్న్‌షిప్ కొనసాగనుంది. ఎంపికైన విద్యార్థులు NHAI ఫీల్డ్‌ ఆఫీస్‌లు, హెడ్‌క్వార్టర్స్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో పాటు సర్టిఫికెట్ ఇస్తారు.

News March 26, 2026

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళల పొడిగింపు

image

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని పని వేళలను పొడిగించింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 9:30am నుంచి 8:30pm వరకు పని చేస్తాయని చెప్పింది. రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యనూ పెంచింది. సెలవులు తీసుకోకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

News March 26, 2026

50ల్లోనూ యవ్వనంగా.. మలైకా సీక్రెట్ ఇదే?

image

3 రకాల వాటర్ షాట్స్ థెరపీ 52 ఏళ్ల వయసులోనూ తనను ఫిట్‌&అందంగా ఉంచుతోందని మలైకా అరోరా తెలిపారు.
ఇమ్యూనిటీ షాట్: అల్లం, పసుపు, పుదీనా, తులసి ఆకులు, చియా సీడ్స్, తేనె కలిసిన నీటిని తాగడం.
డైజెస్టివ్ షాట్: రాత్రి గ్లాస్ వాటర్‌లో టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర, సోంపు, మెంతి గింజలు నానబెట్టిన నీరు తీసుకోవడం.
గ్లో షాట్: అలోవేరా జెల్ కలిపిన నీటిలో అవసరమైతే చియా సీడ్స్, సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగడం.