News September 25, 2025
ట్రంప్‌కు నోబెల్ PEACE.. ఛాన్సే లేదు!

USA అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం పొందే అర్హతలు లేవని జ్యూరీ వర్గాలు తెలిపాయి. భారత్ – పాక్ సహా పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపిన తనకు పీస్ ప్రైజ్ ఇవ్వాలని ట్రంప్ బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే స్వతంత్రంగా వ్యవహరించే సెలక్షన్ కమిటీ, దీనిని ఓ నెగటివ్ పాయింట్‌గా పరిగణిస్తోంది. శాంతి స్థాపన అంటూనే గాజాపై ఇజ్రాయెల్ వార్‌ను ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారని గుర్తు చేసింది.
Similar News
News January 19, 2026
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ అజెండా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు <<18900983>>నోటీసులు<<>> జారీ చేయడంపై KTR తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ‘X’ వేదికగా మండిపడ్డారు. ఇందులో పస లేదని సుప్రీంకోర్టే కేసును కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దిగజారుడుకు నిదర్శనమన్నారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
News January 19, 2026
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: KTR

TG: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీశ్ రావును తప్పుడు కేసులతో <<18900983>>ఇబ్బంది<<>> పెడుతున్నారని KTR ఫైర్ అయ్యారు. ‘మాకు చట్టం, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఏ విచారణకైనా సిద్ధం. విచారణలు, నోటీసుల పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.
News January 19, 2026
ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.


