News March 1, 2025

ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

image

ట్రంప్, జెలె‌న్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.

Similar News

News March 1, 2025

రేపటి నుంచి దబిడి దిబిడే..

image

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

News March 1, 2025

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.

News March 1, 2025

సెమీస్‌కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్‌లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్‌లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్‌ సెమీస్ చేరుతుంది.

error: Content is protected !!