News March 19, 2024
ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి: కమలా హారిస్

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన్ను ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా అభివర్ణించారు. ‘ట్రంప్ మన ప్రాథమిక స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. నేను, జో బైడెన్ కలిసి మన హక్కుల్ని కాపాడుతాం. తుపాకీ హింస సంస్కృతికి పరిష్కారాన్ని తీసుకొస్తాం. ట్రంప్‌నకు మాకు మధ్య వ్యత్యాసం సుస్పష్టంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు: ప్రకాశ్‌రాజ్

లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్‌గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
News November 4, 2025
ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి జరిగితే మేమొస్తాం: బీజేపీ

తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. ‘ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.


