News August 8, 2025
చైనాపై టారిఫ్స్ పెంచాలంటే ట్రంప్ వణుకు.. కారణమిదేనా?

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా చైనాపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 30% టారిఫ్స్ విధిస్తున్నారు. USలోని ప్రముఖ ఆటోమొబైల్, టెక్ కంపెనీలకు చైనా అరుదైన ముడి సరుకులు సప్లై చేస్తోంది. టారిఫ్స్ పెంచితే ధరలు పెరుగుతాయి. అమెరికాను శాసించే బడా కంపెనీలు దీనికి సిద్ధంగా లేవు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
Similar News
News August 8, 2025
‘కెప్టెన్ జురెల్’ అని RR పోస్ట్.. శాంసన్ ఫ్యాన్స్ షాక్!

ధ్రువ్ జురెల్‌ను కెప్టెన్‌గా పేర్కొంటూ రాజస్థాన్ రాయల్స్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘స్టంప్స్ వెనుక ఆటను మార్చే వ్యక్తి ఒకరు ఉంటారు’ అని రాసుకొచ్చింది. అయితే <<17338073>>శాంసన్<<>> RRను వీడుతారనే ప్రచారం నడుమ ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. సంజూ స్థానంలో జురెల్‌కు పగ్గాలిచ్చారా? అని ఫ్యాన్స్ షాకయ్యారు. ట్విస్ట్ ఏంటంటే జురెల్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు కెప్టెన్సీ చేయనున్నారు. దాని గురించే RR పోస్టు చేసింది.
News August 8, 2025
ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్

ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు. వారానికి 3 సార్లు తినే వారిలో 20శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తమ రీసెర్చ్‌లో తేలిందని వెల్లడించారు. అంతే మొత్తంలో ఉడికించి, కాల్చిన బంగాళాదుంపలను తింటే ముప్పు ఈ స్థాయిలో ఉండదని హార్వర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీల పరిశోధకులు 40 ఏళ్లుగా జరిపిన నివేదికలను బయటపెట్టారు.
News August 8, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండగా.. సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 80,126 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 24,444 వద్ద ట్రేడవుతున్నాయి. టైటాన్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ITC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.