News November 6, 2024

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ‘కింగ్’

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్‌లోనూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సత్తా చాటారు. పెన్సిల్వేనియా (19 ఎలక్టోరల్ ఓట్లు), జార్జియా (16), నార్త్ కరోలినా (16), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో గెలిచారు. ఆరిజోనా (11), మిచిగాన్ (15), నెవాడా (6) రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇవి కూడా ట్రంప్ ఖాతాలో చేరినట్లే. ఈ రాష్ట్రాల్లో ట్రంప్ మొత్తం 91 ఓట్లను సొంతం చేసుకున్నారు.

Similar News

News January 3, 2025

నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?

image

చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్‌ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్‌ను మరో రూమ్‌లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.

News January 3, 2025

ప్రేమ కోసం పాక్‌కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!

image

ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్‌కు చెందిన సనా రాణి(21)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.