News January 22, 2025

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

image

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారంలోకి రాగానే జన్మత: పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Similar News

News January 22, 2025

తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

News January 22, 2025

మహా కుంభమేళాకు వెళ్తున్నారా?

image

‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్‌లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్‌లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్‌లైన్‌లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్‌లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.

News January 22, 2025

కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

image

కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.