News August 18, 2024
కమలపై నోరుపారేసుకున్న ట్రంప్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కంటే తాను బాగా కనిపిస్తానంటూ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా ర్యాలీలో నోరుపారేసుకున్నారు. ఇటీవల టైం మ్యాగజైన్ కవర్ పేజీపై కమల ఫొటోను ప్రస్తావిస్తూ ఆమె ఫొటోలు సరిగా లేకపోవడంతో మ్యాగజైన్ వాళ్లు స్కెచ్ ఆర్టిస్ట్‌ను హైర్ చేసుకున్నారని తన అహంకారాన్ని వెళ్లగక్కారు. కమల ర్యాడికల్ లిబరల్ అంటూ వ్యాఖ్యానించారు.
Similar News
News January 21, 2026
OpenAI పని ఖతం: జార్జ్ నోబుల్

OpenAI కంపెనీ త్వరలో కుప్పకూలుతుందని ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ నోబుల్ అంచనా వేశారు. ఓవైపు Google Gemini యూజర్లు పెరుగుతుంటే ChatGPT ట్రాఫిక్ వరుసగా 2 నెలలు పడిపోయిందన్నారు. ఆ కంపెనీ సింగిల్ క్వార్టర్‌లో $12B నష్టపోయిందని, టాలెంటెడ్ ఉద్యోగులూ వెళ్లిపోతున్నారని చెప్పారు. మరోవైపు మస్క్ వేసిన $134B <<14762221>>దావా<<>> ఏప్రిల్‌లో విచారణకు రానుందని గుర్తుచేశారు. వీటన్నింటితో ఆ సంస్థకు మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.
News January 21, 2026
25న రథ సప్తమి.. ఆ దర్శనాలన్నీ రద్దు!

AP: తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఆర్జిత సేవలు, NRI, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించింది.
News January 21, 2026
ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న చాహల్, మహ్వాశ్!

భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత IND క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రేడియో జాకీ, ఇన్‌ఫ్లుయెన్సర్ RJ మహ్వాశ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే SMలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని సమాచారం. పలుమార్లు వీరిద్దరూ కలిసి కనిపించడం, IPL మ్యాచుల వేళ గ్రౌండ్‌లో చాహల్‌ను ఆమె ఎంకరేజ్ చేయడంతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.


