News October 6, 2025
హమాస్‌తో సానుకూల చర్చలు జరిగాయి: ట్రంప్

హమాస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వీకెండ్‌లో సానుకూల చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపన, గాజాలో యుద్ధం ముగింపు, బందీల విడుదలపై జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఈజిప్టులో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయి. ఈ వారంలో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దీనిని వేగంగా పూర్తి చేయాలని చెప్పా. సమయం చాలా విలువైంది. లేదంటే భారీ రక్తపాతం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News October 6, 2025
వీటితో స్నానమాచరిస్తే.. అదృష్టం మీవెంటే!

పచ్చి పాలు: ఆయుష్షు పెరుగుతుంది.
ఉప్పు: చేయాల్సిన పనులు వెంటనే పూర్తవుతాయి.
యాలకులు: శుభ ఫలితాలు ఉంటాయి.
పసుపు: ఆరోగ్యంగా ఉంటారు. చర్మవ్యాధులు తగ్గుతాయి.
రోజ్ వాటర్: మీ పట్ల ఎదుటివారికి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.
ఆవనూనె: శని గ్రహ దుష్ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.
గంగాజలం: పాపాలు తొలగిపోతాయి. శరీరం శుద్ధి అవుతుంది.
News October 6, 2025
DRDOలో 50 పోస్టులు

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 50 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 19వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATSలో ఎన్‌రోల్ చేసుకోవాలి. మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.
News October 6, 2025
స్పోర్ట్స్ రౌండప్ @ 6 అక్టోబర్

⚾ భారత షట్లర్ తస్నీం మీర్‌పై గెలిచిన తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి కెరీర్‌లో తొలి BWF సూపర్ 100 టైటిల్ పొందారు
⚾ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 22 మెడల్స్ (6G, 9S, 7B) సాధించింది
⚾ UP యోధాస్‌ను ఓడించిన తెలుగు టైటాన్స్‌కు PKL-12లో వరుసగా నాలుగో విజయం
⚾ వెస్టిండీస్‌పై గెలవడంతో WTC ర్యాంకింగ్స్‌లో భారత్ 3వ స్థానానికి (AUS-1, SL-2) చేరింది