News January 26, 2025

ఆంథోనీ ఫౌచీకి రక్షణ తొలగించిన ట్రంప్

image

కరోనా సమయంలో ప్రపంచానికి తరచూ పలు హెచ్చరికలు, సూచనలు చేసి పేరొందిన ఆ దేశ మాజీ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీకి ట్రంప్ సర్కారు భద్రతను తొలగించింది. ఆయన తన భద్రతను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వానికి పనిచేసినంత మాత్రాన జీవితమంతా భద్రత ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కాగా.. కరోనా సమయం నుంచీ ట్రంప్ ఫౌచీని వ్యతిరేకిస్తున్నారు.

Similar News

News October 31, 2025

రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చేయండి: ఫ్యాన్స్

image

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తమతో కొనసాగుతారని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. ముంబైలో కొనసాగేందుకు తిరిగి జట్టు పగ్గాలు హిట్‌ మ్యాన్‌కు అప్పగించాలని SMలో డిమాండ్ చేస్తున్నారు. ‘కేవలం రోహిత్ సారథ్యంలోనే ముంబై కప్పు కొట్టగలదు. కెప్టెన్సీతో అతనికి తగిన గౌరవం ఇవ్వాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు.

News October 31, 2025

భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అభిషేక్, హర్షిత్ రాణా (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. హేజిల్‌వుడ్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు. గిల్ (5), శాంసన్ (2), సూర్య (1), తిలక్ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4) ఫెయిల్ అయ్యారు.

News October 31, 2025

భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ నియామకాలు

image

ఎలాన్ మస్క్‌కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్‌లింక్’ భారత్‌లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్‌లింక్ పేర్కొంది.