News February 7, 2025

అంతర్జాతీయ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టు తన అధికారాల్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తమపై, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు.

Similar News

News March 31, 2026

మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

image

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?

News March 31, 2026

అప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదు: జడేజా

image

CSK నుంచి రాజస్థాన్ జట్టులోకి ఛేంజ్ అయినప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదని జడేజా తెలిపారు. ‘ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతారు. అందుకే మాట్లాడలేదు’ అని నవ్వేశారు. నిన్న కలిసే అవకాశం రాలేదని, ఈసారి మీట్ అయినప్పుడు అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం ఖలీల్ ధరించిన CSK జెర్సీని జడేజా కిస్ చేశారు. గత సీజన్ వరకు CSK జట్టులో జడ్డూ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News March 31, 2026

ఏఐ డేటా సెంటర్.. 2 డిగ్రీలు పెరగనున్న హీట్?

image

ఏఐ డేటా సెంటర్ల వల్ల అభివృద్ధితోపాటు ఉష్ణోగ్రతా పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘డేటా సెంటర్‌కు భారీగా వాటర్, ఎలక్ట్రిసిటీ అవసరం. అలాగే ఆ కేంద్రం వల్ల 9.9KM విస్తీర్ణంలో హీట్ 2 డిగ్రీల వరకు అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో 9 డిగ్రీల వరకు పెరగవచ్చు. తద్వారా 34 కోట్ల మందిపై ప్రభావం పడొచ్చు. దీన్నే డేటా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం’ అని నిపుణులు తెలిపారు. కాగా ఆ స్టడీపై రివ్యూ జరగాల్సి ఉంది.