News August 3, 2024
గూగుల్‌కు ట్రంప్ షట్‌డౌన్ వార్నింగ్

గూగుల్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కమలా హారిస్ రేసులోకి వచ్చినప్పటి నుంచీ ట్రంప్‌కు వ్యతిరేకంగా గూగుల్ వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ‘నాపై హత్యాయత్నం జరిగితే దానికి సంబంధించిన ఫొటోలు, సమాచారం గూగుల్‌లో లేవు. నా గురించి వెతికితే హారిస్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. గూగుల్.. మీరు షట్ డౌన్ అయ్యే ప్రమాదముంది. జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News March 27, 2026
DDH అంటే ఏంటి?

<<19493931>>DDH<<>> (డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేసియా ఆఫ్ ది హిప్) అనేది చిన్న పిల్లల్లో తుంటి జాయింట్ సరిగ్గా ఏర్పడకపోవడం లేదా కదలడం వల్ల వచ్చే సమస్య. పుట్టుకతో వచ్చే హిప్ డిస్‌లొకేషన్ అని కూడా అంటారు. తుంటి ఎముకలోని సాకెట్‌లో తొడ ఎముక పైభాగం సరిగ్గా సెట్ కాకుండా పక్కకు లేదా బయటకు వస్తుంటుంది. దీని వల్ల నడకలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థరైటిస్‌కు దారితీయొచ్చు. ముందే గుర్తించడం ద్వారా చికిత్స, సర్జరీతో నయం చేయొచ్చు.
News March 27, 2026
ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?
News March 27, 2026
వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ.. మళ్లీ అదే కాంబినేషన్

వెంకీ-కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి తీస్తున్న కొత్త మూవీకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు హీరోలతో ఉన్న ఫొటోలను అనిల్ రిలీజ్ చేశారు. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్, Z స్టూడియోస్ భాగం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో కీర్తీ సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నా మూవీ టీమ్ ప్రకటించలేదు. ఇక సాహు-అనిల్ కాంబోలో భగవంత్ కేసరి, MSVPG మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.


